పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేమాత్రమయిన జోక్యముగలవారి నందఱిని బ్రతికియుండగనే కాల్పించియో, ఒడలు చీలిపించియో, మరియొక విధముగనో చంపించి శిక్షించెను. వారికుటుంబముల నన్నింటిని నాశనముచేసి వారిసొత్తు స్వాధీనము చేసుకొనెను. మొదట విందునకును గృహ ప్రవేశ సందర్భమునకును ఆహ్వానము గొనివచ్చినవాడు కూడ మిగిలిన రాజద్రోహులవలెనే శిక్షింపబడెను. ధన్నాయకుడు రాజధానికి తిరిగివచ్చినపుడీ వృత్తాంతమంతయు విని యాశ్చర్యమగ్న మాసనుడయ్యెను. రాయలు ధన్నాయకుని కటాక్షవీక్షణములతో సముఖమునకును చూపినవాడు, అతడు సాష్టాంగముగ నమస్కరించి "యేలినవారీమ హోపద్రవమును సుఖముగ నుంటచేసిన యీ శ్వరునకు నాకృతజ్ఞతావందనము లర్పించుచున్నాను" అని పల్కెను. ఆ సంవత్సరము రాయలకు గొప్పగండము తప్పుటచే, పునర్జీవియయ్యె గావున ధన్నాయకుడు మహర్నవమి మహోత్సవములు ద్విగుణీకృత వైభవముతో జరుపవలసినదని యాజ్ఞాపించి సన్నాహము చేయించెను.

మహర్నవమి - మహోత్సవములు

"ఈ దేశీయులనుపమ భాగ్య, వైభవ, బల సంపన్నులు. అందువలన, తమవిభవమును, ఐశ్వర్యమును, గౌరవమును సగర్వముగ ప్రకటింపవలయునను కౌతుకము గలవారు. మహర్నవమి పండుగ నీరాయలు, ఆతని మండలేశ్వరులు మున్నగువారలు తమతమ యైశ్వర్యవిభవముల ననుసరించి