పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బీభత్సమునకు వెఱగంది యాభటుని సాహాయ్యమున, అంత:పురము లోనికి బోయెను. ఇంతలో నా రాయల సోదరుడు సింహాసనమెక్కి యచ్చటనున్న వారి నందరిని తన్ను రాయలుగా బరిగణింప వలసినదని యాజ్ఞాపించు చుండెను. అదివిని రాయలే మరియొక ద్వారమునుండి ప్రవేశించి "ఓరోరి రాజద్రోహులారా! నే నింకను జీవించి యుండగనే మరియొక దురాత్ము డెట్లు సింహాసన మధిష్ఠింపగలడు? నా కండ్లయెదుట ద్రోహియైన నాసింహాసనము నదివసించియున్న యాతని బట్టుకొనుడు" అని బిగ్గరగ నఱచెను. ఆసందడి నంతయు నిశ్చేష్టులయి యవలోకించుచున్న జనసమూహము ఆదురాలిమానవుని పైబడి కత్తులతో కండకండలుగ జీల్చివైచి చంపివేసిరి. రాయ లంతట కొలువుదీరి, తన యితర సోదరులను, సామంతులను, దళవాయి, ప్రధానులను రాజ బంధువులను రావలసినదని యాజ్ఞాపించెను. మహాప్రధానితప్ప నందరును మృతులైరన్న వృత్తాంతమును దెలిసికొని రాయలు విషణ్ణుడయ్యెను. ధన్నాయకుడనబరుగు ప్రధానమంత్రి, ఈ దారుణ విప్లవమునకు కొంతకాలము క్రిందటనే సింహళ ద్వీపముమీదకు దండయాత్ర వెడలియుండెను. లేకున్న అతడును చచ్చియేయుండును. రాయలును, రాజధానియందిట్టి ఘోరకృత్యము జరుగుటకై చాలతడవు చింతించి ధన్నాయకుని వెంటనే బయలుదేరి త్వరితముగ రావలసినదని సింహళమునకు చారులను పంపెను. ఈ కుట్రయం