పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లన్నింటినినాయేనుగు బాగుగానెఱింగిన దగుటచేత, తొండమునందు లావైన దూలమును బట్టుకొని, తనముందు నేలను గొట్టుచు నడచుచు బోవుచుండెను. ఇట్లనుదినమును, మేతకు బోవుచు, జలాశయమును జేఱుచుండెను. అంతట మావటీండ్రకు నా యేనుగును బట్టుకొను నాశ సన్నగిల్లెను. కాని రాయలకు మాత్ర మా ఏనుగును బట్టుకొన వలయనను పట్టుదల తగ్గకపోవుట వలన, వారికి మిక్కిలి ప్రాణసంకట మయ్యెను. అట్టులుండ నొకమావటివాడు ధైర్యము చేసికొని, ప్రాణముపై నాశవదలి యాయేనుగు తఱచుగా బోవుమార్గమున నొకచెట్టుపై దాని కంటబడకుండ దాగుకొని కూర్చుండెను. అట్లుకూర్చుండి యాజంతువు చెట్టుక్రింద నుండి, పోవునపుడు గుభాలున దానిపై కురికి, దానివీపు మీదనుండి, దేహము చుట్టును గుండెల మీదుగా బిగించికట్టబడియున్నత్రాడును గట్టిగాపట్టు కొనెను. ఈయవమానమును భరింపజాలక యాజంతువు, రోషము జెంది, తొండముతో నామావటివాని నెన్నిపాట్లు పెట్టవలయునో యన్నిపాట్లను బెట్టినది. చివరకు వాడెప్పటికిని వీపు మీదనుండి క్రిందకు పడకుండుట గని నేలపైబడి దొర్లనారంభించెను. మావటివాడును మిక్కిలి చురుకు దనము గలవాడును, గడుసు వాడును కావున, నాయేనుగు ఎట్లుదొర్లినను వాడుమాత్రము దానిక్రింద బడకుండ తప్పించు కొనుచు కుంభస్థలములు బ్రద్దలగునేమో యనునట్లు నెత్తి పడ మోదుచుండెను. ఈబాధ భరింపజాలక తుద కామత్తేభము