పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలసి, సొలలి, మావటివాడు తన్ను గొలుసులతో దేహమంతయుకట్టి, యిష్టమువచ్చిన తావుకు గొంపోవుటకు సమ్మ పించెనట! రాయలేదుట కా మావటివాడు, పట్టుబడిన మదపుటేనుగును గొంపోయెను. దానిని జూచినపుడు సంతుష్టాంతరంగుడై రాయలు వాతని యుచితరీతిని బహూకరించి పంపెనట.

"హిందూస్థానము నందు రాజులు వేటకు ఏనుగుల నెక్కిబోవుదురు, వేటకు బోయినపుడెల్ల, నెలలతరబడి ఆయడవులయం దుండుచు, ఏనుగుల వేటాడుచు, బట్టుకొనుచుందురు. ఏనుగుల వేటయన్న వారికి బరమ సంతోషము[1] రాయల కెవ్వని మీదనైనను కారణముగల్గి అనుగ్రహము దప్పినపుడును, వానినేరము, మిక్కిలి గొప్పదైనపుడును, వానిని యీ మదపుటేనుగుల మ్రోల బడద్రోసి, త్రొక్కించి చంపుదురు. అవి వారిని కాళ్లతో త్రొక్కుచు, దంతములతో బొడుచుచు, తొండములతో చీల్చివేయును. వర్త

  1. అబ్దుర్ రజాక్ తాను విజయనగరమున, విని, చూచిన దానినిబట్టి, హిందూస్థానపు రాజుల కందఱకు నొక్క విధమగు నాచారమును వేడుక వ్యాచారమును సూచించు చున్నాడు. అబ్దుర్ రజాక్ నిజముగా పొరబడినాడనియే మామతము. ఈప్రౌడదేవ రాయలకు ఏనుగులవేట యనిన మిక్కిలి ప్రీతియట! అందువలన నాతనికి గజబెంటదేవరాయలని బిరుదము గలదట. దేవరాయనిబట్టి యాతని వేడుకను ఇతరరాజులకు కూడ రజాకు ముడివెట్టియున్నాడు.