పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళ్ళి దానిని కొట్టుచున్న మనుష్యుని చేతిలోని కర్రలాగుకొని వానినిచావగొట్టునట్లు నటించి పలాయితుని జేసి యాకఱ్ఱను దూరముగా విసిరి పాఱ వేయును. పిమ్మట నాయేనుగున కాహారముగా నింత రొడ్డను, నీటిని యుంచి చల్లగా వెడలిపోవును. ఇట్లు కొన్ని దినములు వరుసగా నీ కపట నాటక మాడబడును. ఒకడు ప్రతిదినమును వచ్చి ఆ యేనుగును చావ మోదుచుండును. రెండవవాడు వానిని తరిమివేసి కర్ర విసరివైచుచు దాని కింతయాహారము వేసిబోవుచుండును. ఇట్లు కొంతకాలము గడచునప్పటి కాజంతువునకు మొదటి వానిపై తీరనికోపమును, రెండవవానిపై నపారమైన ప్రేమయు నంకురించును. అంతట రెండవవాడు మెల్లమెల్లగా యేనుగును మచ్చిక చేసుకొని, దగ్గరకు జేరి, మేనును, తొండమును నిమురుచు, మంచి రుచ్యములయిన పండ్లను, కాయల నొసంగుచు చనువు చేసికొనుచు ఆ యేనుగును, వానియం దత్యంత విశ్వాసముగలదై, తన మెడకు గొలుసులు తగిలించినను యూరకొనును.

"వెనుక నొకసారి, ఈ రాయల గజశాలనుండి, తప్పించుకొని అడవులకు పాఱిపోయిన యొకానొక మత్తేభమును గూర్చి యొకకథ చెప్పుదురు. అప్పుడాతని మావటీడు, దాని వెంటనే చని తఱచుగా నాయేనుగు ఆహారమునకై చరించు తావులందక్కడక్కడ పెద్ద పెద్ద గోతులను త్రవ్వియుంచెనట. మావటీండ్రు ఏనుగులను బట్టుటకే చేయు మాయపన్నుగడ