పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పమున కెదురుగా రాయల ఏనుగులసాల గలరు. రాయల కీ దేశమందుచాల ఏనుగులు గలవు. కాని వాటిలో మంచివాటిని పెద్దవాటిని మాత్రము రాయలు తన యుపయోగార్థముంచుకొన్నాడు. పట్టణము లోనికి ప్రవేశించునపుడు మనకు తగులు వెలుపలి ఆరేడుప్రాకారముల నడుమ వాయవ్యదిశయందు అనగా ఉత్తరపశ్చిమ ద్వారముల నడుమ, నీయేనుగులను పొర్లించుటకు, పిల్లయేనుగులను పెంచుటకు, మత్తగజములను సాధుచేయుటకును, యేర్పాట్లుగలవు. రాయలకు మంచి చక్కనైన ఐరావతమును బోలిన వెల్లయేను గొకటి కలదు. దానిమీద ముప్పదివరకు నల్లని మచ్చలు గలవు.

"ప్రతియుదయమునీ వెల్లయేనుగును రాయల సమ్ముఖమునకు దీసికొని పోవుదురు. ప్రాత:కాలమున నీ మదకరీంద్రమును దర్శించుట రాయలకు శుభశకునమట. రాయలవారి రాచయేనుగులకు అన్నము వండి పెట్టుదురు. ఆవంట లా కరులముంగిటనే జరుగవలయును. ఉడుకుటయైన తరువాత నాయన్నమునందు కొంచముప్పును, బెల్లమునువేసి, రెండేసి మణుగులు బరువుగల ముద్దలుగా జేసి, నేతిలోగాని, పెరుగులోగాని ముంచి యా జంతువుల నోటిలో నుంతురు. ఆయాహారమును తయారుచేయుటలో సేవకు లే పదార్థమును పొరబాటున వేయుట మరచినను, ఆజంతువులు వారిని జంప నుద్యమించును. రాయలుకూడ వారి పొరబాటును మన్నింపక కఠినముగా శిక్షించును. ఇట్లీ విధమున నా మత్తగజములకు