పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టంకసాలకు నడుమనున్నట్లు గాన్పించుచున్నది. దానికిలోపల ప్రహరీగోడ యొకటి గలదు. భాండారమంతయు భూమిలో నున్నది. దానికి చుట్టును వీరభటు కావలికాయుటకు వెడల్పయిన త్రోవ యొకటి గలదు. భాండాగారము నలుచదరమైనది. దానిపైన మరియొక అంతస్థు గలదు. ఆఅంతస్థునకు క్రిందభాగమున కర్రసరంభీ గలదు. ఈభాండారము లోనికి మార్గము తూర్పుగా వచ్చును. ఆమార్గమంయు చీకటికోణముగా నుండును. ఆమార్గమునకు చివర పైకి వచ్చుటకు ఱాతిమెట్లు గలవు. ఈ భాండారపు గదినుండి వెలుపలికి బోవుటకు ద్వారము తూర్పువైపున గలదు. ఆగదిలోపల నాలుగు పెద్ద స్తంభములు గలవు. ఈగదియు, దానిపైమిద్దెగదియు వాటిగోడలును, స్తంభములును అవియు తెల్లపాలగచ్చుతో నునుపుచేయబడి యున్నవి. ఇపుడాస్తంభములపై నుండిన సరంబి కూలిపోయినది. గాని క్రిందగదిమాత్రము స్తంభములతో మంచిస్థితియం దున్నది. వర్షము కురిసినను ఈపాతాళపు కొట్టులోనికినీరు దిగకుండుటకై చుట్టు ఎత్తుగా పిట్టప్రహరీగోడ యొకటి నేటికిని గానవచ్చుచున్నది. ప్రౌడదేవరాయలకు క్రీడాభిగామకృతి కర్తయనిబరగు వల్లభరాయని తండ్రియగు త్రిపురాంతకుడు (తిప్పయ్య మంత్రి) నవరత్న సువర్ణ భండార రక్షకుడుగా నుండెను.

ఏనుగులు, వాటిని బట్టుకొనువిధము.

"నగరున కెదురుగా (అనగా తూర్పుగా) ప్రధాన మంత్రి సభామంటపము గలదని దెల్పితినిగదా! ఆసభామంట