పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షులు పూవులు ముడువకుండ, ధరింపకుండ, నెక్కడకు బోలేరు. ఒక్కొక్క విధమగు వస్తుచయమును విక్రయించు నొక్కొక వాడవర్తకులు ఒక్కొకచోట గుమిగూడి జుట్టుగావ్యాపారము చేసికొందురు, ఏసరకులవాడ యాసరకులదేగాని యింకొక సరకావాడలో దొరకదు.[1] ఇచ్చటి రత్నవర్తకులు నిర్భయముగా తమసరకులను ఎంతవిలువగల వాటినైనను తమవజ్రవైడూర్య మాణిక్యములను, పచ్చలను, నీలములను, పద్మరాగములను, రత్నములను, మంచి ముత్యములను, పగడములను విచ్చలవిడిగా రాసులక్రింద బోసి నడివీథులందు విక్రయించుకొను చుందురు.

"అత్యంత రామణీయకమై మనోజ్ఞమైన యచ్చోట నగరివాకిట కెదురుగా నున్న నాలుగువీథులందును చక్కని నునుపైన ఱాతికాలువగుండ పరిశుద్ధజలము నగరులోనికి పట్టణము లోనికి నెడతెఱిపిలేక పాఱుచుండును. ఈఱాతికాలువలు పట్టణమునం దంతటను గానుపించును. రాయల సౌధమునకు కుడివైపున మంత్రి శేఖరుని సభాగారమంటపము కలదు[2]

  1. ఇప్పటి మచిలీబందరు నందు అట్టి విధమయిన బజారున్నది. ఒక్కొకరకపు దినుసు కొకబజారు యిప్పటికిని బందరు నందు గలదు.
  2. అబ్దుర్‌ రజాక్ చూచిన సభామంటపమును, దానికుత్తరముగా నుండిన దస్తరములకొట్టును శిథిలావస్థయం దిపుడు నగరువాకిట నాలుగు వీధుల మొగ కావలిప్రక్క గానుపించుచున్నవి. సభా గారము పూర్వపుశోభతో నిపుడు గానరాదు. శ్రీనాథుడు కనకాభిషేకమును వడసిన మౌక్తికసభాగార మిదియే కావలయును. పూర్వమున ఈ సభామంటపము ఱారుస్తంభములతో, తోరణములతో మనోజ్ఞములయిన రంగురంగుల చిత్తరువులతో నొప్పారుచుండెను కాబోలు. స్తంభములు కర్రవి యనియు సరంబి కూడకర్రతో కట్టబడి రంగురంగుల చిత్తరువులతో శోభిల్లు చుండెననియు, నదియంతయు తల్లికోటయుద్ధానంతరము తురకలచే తగుల పెట్టబడియెననియు సూయలుగా రూహించుచున్నారు. ఇపుడా మంటపమున నలుబది స్తంబపు దిమ్మలుగాక నరువది గానవచ్చు చున్నవి.