పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ విశాలమంటపమునకు నలుబది స్తంభములు గలవు. వాని కెదురుగా మనిషికంటె యెత్తయిన వసారా యొకటిగలదు. ఆ వసారా యించుమించుగా యిరువది గజములు పొడవును, ఆరుగజములు వెడల్పును గలదిగానున్నది. దీనిని దస్తర్‌ఖానా "దస్తరములకొట్టు" అని పిలుతురు. రాజ్యమునకు సంబంధించిన యావత్తుకాగితములు, పత్రములు మొదలగున వన్నియు, దస్తరములుగా గట్టి యందుంతురు. ఇచ్చటనే కరణములు, తెఱపిలేక లెఖల వ్రాయుచు కూర్చుండియుందురు. ఇచ్చటి జనులు రెందువిధముల వ్రాతసామగ్రి నుపయోగింతురు. అందు మొదటిది: రెండుగజములుపొడవును రెండువ్రేళ్ళ వెడల్పును గల తాటాకులు. ఈజను లాతాటాకులపై గంటములతో పరపర గీకుచు వ్రాయుదురు. ఈవ్రాత అంత శ్రేష్ఠమైనదిగా జనులు తలంపరు. తాటాకులపై గీకబడిన యక్షరములు మసితో వ్రాయబడ నందున రంగుతో కంటికి గానరావు. అదియును గాక తాటియాకులు చిరకాలముండక