పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని, మసిబొగ్గుతోగాని అంతమనోహరముగ నారూపములను చెక్కజాలడని నాయభిప్రాయము.

"ఉన్నతమయిన యాదేవాలయమున శిఖరమునుండి పాదము వఱకు నొకయఱచేతిమేరయినను పూర్వపశ్చిమఖండముల పూర్వ చిత్తరువులతో నిండియుండని స్థలమేలేదు. ఆ దేవాలయము చుట్టును నాలుగేసి యంతస్థులు గల్గి ముప్పది గజములు పొడవును ఇరువది గజములు వెడల్పును ఏబదిగజములయెత్తును గల నాల్గు గోపురములును గలవు.

"ఇతర మంటపములు మొదలగునవన్నియు నిట్లే యతి మనోహరమయిన చెక్కడపు బనులతోడను చిత్తరువుల తోడను శోభిల్లుచున్నవి. ఆకోవెలయందు రాత్రింబవళ్ళు భగవంతుడు స్వీకరింపని ప్రార్థనలు, సంగీతనృత్య వాద్యములు, నై వేద్యములు సమర్పింప బడుచుండును! ఆ దేవాలయను నుండి ధనమును, వెచ్చములను, సమస్తములును ఆగ్రామవాసులు తెచ్చుకొను చుందురు. [1]'నాస్తికులగు' నీహిందువుల కీక్షేత్రము ముసల్మానుల మక్కావంటిదని చెప్పుదురు. ఇచ్చట రెండుమూడు దినములుండి తిరిగి ప్రయాణము సాగించితిని. జిహిజ్జా (క్రీ. శ. 1443-చైత్రము) మాసాంతమున విజయనగర పట్టణమును జేరితిని. నారాక విని సార్వభౌముడు స్వాగత మిచ్చుటకై తగినపరివారమును ఎదురు సన్నాహముచేసి బంపెను.

  1. ఇది యొక విష్ణ్వాలయము గావచ్చును. అబ్దుర్ రజాక్ చూచిన దేవాలయ మేయూరిదోగాని తెలియరాదు.