పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారమున సూర్యుని సైతము కప్పివేయజాలినంత యెత్తైనశిఖరమును జూచితిని. ఆపర్వత మొక యరణ్యమధ్యమున నున్నది ఆయరణ్యమును, పర్వతశిఖరమును దాటి 'బేదునూరు' అను పట్టణము జేరితిని. బేదునూరు నగరమున నిండ్లన్నియు మేడలవలెను సౌధములవలెను గన్పట్టును. ఈ బేదునూరు నందు మిక్కిలి యెత్తయిన యొక ప్రసిద్ధమయిన దేవాలయము గలదు. దాని శిఖరము బేదునూరు నుండి పెక్కుమైళ్లవరకును గాన్పించు చుండును. అతిశయోక్తియని నిందలేకుండ దాని సౌందర్యమును వర్ణించుట కడుకష్టము. ఆ దేవళము నగరమునకు నడుమ విశాలమైన ప్రదేశమునందు, చక్కని పూదోట యందుగలదు. ఆపూదోటయందు పూయనిపుష్పములు, చిగుర్పని ఆకులులేవు. ఆ ఆరామముమధ్య చలువరాతితో గట్టిన మేలైన మంటప మొకటి గలదు. ఆ మంటపము మనిషి యెత్తున నుండును. మంటపము నందలి ఱాళ్ళు నున్నగా చెక్కబడి యొకదానిపై నొకటి సున్నములేకయే అతుక బడినట్లు అమర్చబడి యుండెను. చూపఱ కీమంటప మంతయు నొక్కఱాతితో చెక్కబడినదా యనియుగూడ సందేహము గలుగ జేయుచుండును. ఆ మంటపము నడుమ నల్లఱాతితో నిర్మింపబడిన దేవాలయము గలదు. ఆ దేవాలయముపైన మనుష్యవిగ్రహములు నానావిధములుగ, మూడు బారులుగ నొకదాని క్రిందట నొకటిగా చెక్కబడియుండెను.

"ఎంతటినేర్పరియైనను, చిత్రకారుడు తనగంటముతో