పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొద్దకు దర్శనార్థము దీసికొని పోయిరి. నేను అచ్చట నితర మనుష్యులవలె మొలగుడ్డ కట్టుకొనియున్న యొకని జూచితిని. అచ్చటి వారంద ఱాతని రాజందురు. వారు తమరాజును సామూరి యని పిలుతురు. ఆతడు మరణించిన వెనుక, నాతని సింహాసనముపై యాతని తోబుట్టువుకుమారుని కూర్చుండ బెట్టుదురట. కడుపున బుట్టిన కుమారునికి గాని, యాతడు లేనప్పుడు సోదరునికి గాని పట్టాభిషేకము చేయుదురట! శౌర్యపరాక్రమాదులవల్ల నెవడు నిచ్చట రాజగుట లేదు. ఇచ్చటి నాస్తికులలో పెక్కు తరగతి జాతులవారు గలరు. బ్రాహ్మణులు, సన్యాసులు మొదలయినవారున్నారు. వారందఱు అనేకమంది దేవతలను గొల్చుచుందురు. విగ్రహపూజలు గావించుచుందురు. ప్రతివర్ణము వారికిని వింతవింత యాచారములు గలవు.

"ఇచ్చటిజనులలో నొకజాతి గలదు. ఆజాతిలోని స్త్రీకి పెక్కుమంది భర్త లుందురు. వారందఱు తమ యిష్టము వచ్చిన వ్యాపారమును జేసికొను చుందురు. ఆభార్యతో గాపురము చేయుటకు రాత్రింబగ ళ్ళిరువదినాలుగుగంటల కాలమును వారుసమానముగా పంచు కొనుచుందురు. ఒకభర్త యాస్త్రీతో నున్నంతకాలము మరియొక భర్త యాస్త్రీకడకు బోరాదు. ఆదేశపు రాజగు సామూరి యీజాతికి చెందినవాడే యట!

"నేను సామూరిని దర్శింప బోవునప్పటికి అతని కొలు