పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటికి నన్ను నిరుత్సాహపఱచినవారు మాత్రము జీవించి యుండరైరి.

కళ్ళికోట నగరము

"కళ్ళికోట రేవులో నోడదిగి యూరిలోనికి బోవునప్పటికి నేను కలలోగూడ కనివిని యెఱుగని యొకవికృతజాతి మనుష్యులు నాకంటబడిరి. ఆట్టివారిని మన మెక్కడను జూడజాలము.

నల్లని దేహచ్ఛాయ వెడదనోరు వ్రేలాడు చెవులు, భీకర స్వరూపము గల్గిన యీ దేశపు స్త్రీపురుషులు మొలపై నొకగుడ్డతప్ప నించుమించుగా దిగంబరులయి యుందురు. కుడిచేతిలో ముత్యమువలె తెల్లనై ప్రకాశించు, నొక కత్తిని, యెడమచేతిలో కాఱుమబ్బువలె నల్లనై కాన్పించు తోలుతో చేయబడిన డాలును ధరించి తిరుగు చుందురు. తిరిపె మెత్తుకొను బిచ్చగాని మొదలుకొని నగరమేలు నృపాలుని వఱకు గూడ నిట్లే యుందురు. ముసల్మానులు మాత్ర మట్లుగాక మంచి విలువకలిగి అందములైన యంగీలను, పచ్చడములను, విరివిగా నరబ్బులవలె ధరించి తమ సంపన్నత్వమును వెల్లడి చేసుకొను చుందురు.

"పట్టణములోనికి బోయిన వెనుక నేను చాలమంది మహమ్మదీయుల తోడను, నాస్తికులగు దేశీయుల తోడను ముచ్చటించితిని. వారు నాకొక యనుకూలమైన భవనమును బసగా నిచ్చిరి. మూడుదినములయిన పిదప నన్ను వారి రాజు