పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాయబారిగా నరుగవలసినదని యాదేశమంపెను. అంతట నాతడు హార్మజు రేవున బయలుదేరి సముద్రమున కావలిగట్టును గూర్చి పయనమయ్యెను.......... హార్మజు పట్టణము ఆరాజధానికి ముఖ్యనగరము. అది గొప్ప రేవు పట్టణము, దానికి "జెరూన్" అని మఱియొక పేరుకూడ గలదు. ఆమహానగరమునకీడయిన పట్టణ మీ ధరాతలమున నింకొకటి కానరాదు. నవద్వీపములనుండి వర్తకు లిక్కడ కేతెంచెదరు. ఈజిప్తు శిరియా, రూమ్, (టుర్కీ) ఆజర్ బైజాన్, ఇరాఖ్, పార్సి, ఖురాసాన్, మావారాల్ నహర్, టుర్కిస్థాన్‌దష్‌తు-ఇకినిచాన్, కల్మక్ దేశములుమున్న గువాటినుండియు, తూర్పున చీన్, మాచీన్, ఖాన్‌చాలిన్ మున్నగు దేశదేశాంతరముల నుండియు వర్తకులు వచ్చుచు పోవుచుందురు. చీనా, జావా, బంగాళము, సింహళము జిర్‌బాద్ నగరములు, తనాసిరి, సకోట్రా, మాలదీవులలోని తొంబదినరములు, మలబారు, అబిస్సీనియా, జాంజిబారు, విజయనగర సామ్రాజ్యపు రేవులు, కలబరిగె, ఘూర్జరము, కంబా, అరేబియా దేశపు రేవులు, ఏడెను, జంబో, మున్నగు నానాద్వీపదేశాంతర పట్టణములనుండి వర్తకులు వారివారి దేశములందు దొరకెడి యపూర్వములయిన వస్తుసామగ్రి నెల్లప్పుడు దెచ్చుచు నిచ్చట నమ్ముకొను చుందురు. వారు దెచ్చెడిసరకులు సూర్యచంద్రాదులు, వర్షములుగూడ మెరుగు పెట్టదలచునంత అపురూపము లయినవి. భూమిపైగల నీయాదేశములనిలేక యన్నిప్రాంతములనుండియు వ్యాపారులి