పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడు ముదిమి కాలమున రచించినదయ్యు నాతని చరిత్ర, విజయనగర సామ్రాజ్యమునకు సంబంధించినంత వఱకు మనోహరములును సూక్ష్మములునయిన చారిత్రక విషయములతో నొప్పాఱుచున్నది. ఇట్టిగ్రంథమే లేకుండిన యిమ్మిడి దేవరాయలనాటి విజయనగర సామ్రాజ్యమును గురించిన కొన్ని యపూర్వ వృత్తాంతములు మనకు దెలిసియుండవు.

"మల్లూ-ఉస్-సఅదయిన్" పారశీకభాషయందు రచింపబడియున్నది. ఇందులో మన విజయనగర సామ్రాజ్యమునకు సంబంధించినంత భాగము, బెంగాలు సివిలుసర్వీసులో పనిచేసిన సి. జె. ఓల్డుప్రభు అనునాతనిచే నాంగ్లభాషలోని కనువదింపబడి, సర్ హెన్రీ. యం. ఎలియట్ గారిచే సంస్కరింపబడియెను. ఇపుడా గ్రంథమే మనచారిత్రమునకు మూలాధారము.[1]

హిందూస్థానమునకు రాయబారము

అబ్దుర్‌రజాక్, హిందూస్థానమునుగూర్చి యిట్లువ్రాయుచున్నాడు. (హిజరాశకము 845 వ సంవత్సరమున క్రీస్తుశకము 1441), జ్యేష్టమాసమున నొక శుభదినమున సకల పృధ్వీపతియగు మాఱేడు యీచరిత్రకారుడును ఇషాక్ కుమారుడును నగు అబ్దుర్ రజాక్‌నకు, హిందూస్థానమునకు

  1. నేనీచరిత్రమును ప్రతిపదార్ధముగా తెనిగింపక కొంచము స్వేచ్ఛగా యధామూలముగా తెలుగుచేసితిని. పాఠకు లిందుకు మన్నింతురుగాక.