పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ్చట తాము దెచ్చినసరకుల నమ్ముకొనుచు నిచ్చటి సరకులను గొంపోవు చుందురు. వారు ఒక్కొక్కప్పుడు తమకు గావలసిన వస్తువులకు సరియగు విలువగల తమసామగ్రిని మార్చుకొందురు. వెండిబంగారముల మీద దప్ప ఈరేవున దిగుమతి వస్తువు మీదవెలచేసి నూటికి పదియవపాలు ఆరాజునకు వర్తకులు రేవుసుంకము చెల్లింప వలయును. అనేక విధములగు మతప్రచారకులు కాఫరులు, నాస్తికులు, మున్నగు నానాదేశీయులగు వారనేకు లీనగరమున గలరు. వారంద రానగరాధీశ్వరుని ధర్మపరిపాలనము క్రింద నే యన్యాయమును బొందక సుఖించు చున్నారు. అందువలన నీ నగరమునకు న్యాయపరిపాలనమునకు ధర్మమునకు ఉనికిపట్టు అను అర్థమిచ్చు "దారుల్ అమాన్" అను ప్రసిద్ధిగలదు. ఈ నగరి వాస్తవ్యులు ఐరాకీయుల వినయ మర్యాదలను హిందువులు నేర్పుతో ప్రకటింతురు.

"ఈ నగరమున నేను ప్రయాణమునకు బూర్వము రెండు మాసము లుండవలసి వచ్చెను. నేను వ్యాపారినేమో యనియు సుంకమీయక పారిపోవ దలచిన వాడనేమో యనియు, రేవుసుంకరులు నన్ను త్వరలో వెడలనీయక పరీక్ష చేయసాగిరి. ఈ పరీక్షలో ఓడలు బయలుదేరు ఋతువు దాటిపోయెను. అంతట వర్షకాల మారంభమై యుండి నందున వర్షములు వెనుకబడి తుపానుల భయము తీఱువరకును నన్ను పయనము సేయనీరైరి. నాతోనుండిన గుఱ్ఱము