పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షా-రుఖ్‌న కంకితము. చేసెను. కృతినొసంగు సమయమున సుల్తాను, అబ్దుర్ రజాక్ పాండిత్యమునకును రాజభక్తికిని కడుమెచ్చుకొని తనహస్తమును అత్యంతగౌరవ సూచకముగ ముద్దిడనిచ్చి సంభావించెను. ఆప్రభువు పరిపాలనా వసానకాలమున నితడు విజయనగర చక్రవర్తికడకు రాయబారిగా బంప బడియెను. విజయనగరమున నుండి స్వదేశమగు ఖురాసాన్ దేశమును సుఖముగా జేరునప్పటి, కనేకకష్టము లనుభవించి దుర్దశల పాలయ్యెను. విజయనగరము నుండి తిరిగివచ్చిన తరువాత క్రీ. శ. 1446 వ సంవత్సరమున "గిలాన్" దేశమునకు రాయబారిగా బంపబడియెను. కాని యాపని పూర్తిగాక మునుపే యీజిప్తు దేశమునకు బోవలసినదని సుల్తాను షారుఖ్ వర్తమానము పంపియుండెను. ఇంతలో నాతని నింతయాదరించి గౌరవించిన యాసుల్తాను మరణించుటచే ఈజిప్తు రాయబారము కొనసాగియుండ లేదు. సుల్తాన్ షారూఖ్ మరణించిన తరువాతను గూడ నితడు వరుసగా సింహాసన మదిష్ఠించిన మీర్జాఅబ్దుల్ లటీప్, మీర్జాఅబ్దు-ల్లా, మీర్జాఅబుల్ కాశిం సుల్తానుల కొలువుకూటముల గౌరవింప బడుచువచ్చెను.

క్రీ. శ. 1452 వ సంవత్సరమున సుల్తాన్ అబుల్ కాశిం బాబరుతో గలసి "టఫ్‌ట్ యజ్దు" అనునగరమున కరిగి యుండెను. ఆసంచారము నందు చరిత్రకారుడగు షయాఫ్-ఉద్దీన్ ఆలియజ్ది అనువానితో సుల్తాను ముచ్చటించినపుడు ఆసంభాషణ నాలకించుట కీతడు నాహ్వానింపబడియెను. ఇది జరిగిన