పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అబ్దుర్ రజాక్

యిమ్మడి దేవరాయలనాడు విజయనగరమున

పారశీక రాయబారి 1441 - 1444.

అబ్దుర్ రజాక్ జీవితము.

అబ్దుర్ రజాక్ యొక్క నిండుపేరు కమాలు-ద్‌దీన్ అబ్దుర్ రజాక్. అతని తండ్రిపేరు జలాలు-ద్‌దీన్ ఇషక్, అబ్దుర్ రజాక్ తండ్రి మధ్య ఆసియాఖండములో 'సమరఖండ' దేశవాస్తవ్యుడు. మన కథానాయకుడు మహమ్మదీయ హిజరాశకము 816 సంవత్సరము ష-అబాన్ మాసమున పన్నెండవదినమున (అనగా క్రీస్తుశకము 1413 వ సంవత్సరము నవంబరు 6 వ తేది.) హిరాట్ నగరమున జన్మించెను. పారశీక చక్రవర్తియగు సుల్తానుషా-రుఖ్‌కొలువున జలాలుద్దీన్ కొంతకాలము "కాజీ" యుద్యోగమునను, మరి కొంతకాలము "ఇమామ్" ఉద్యోగమున నుండుచు సుల్తానుచే నప్పుడప్పుడు ధర్మసందేహ నివర్తికై యాహ్వానింప బడుచు ధర్మగ్రంథములు చదివి వినుపించుచుండెను. అబ్దుర్ రజాక్ తండ్రివలెనే గొప్ప విద్వాంసుడును, అరబీభాషయందు వైయ్యాకరణియు నైయుండెను. తండ్రి చనిపోయిన తరువాత నతడు అరబీభాష లోని ప్రత్యయములు, సర్వనామములను గూర్చి 'అజ్దుద్‌దీన్ యాహ్య' అనునాతడు వ్రాసిన వ్యాకరణమునకు గొప్ప వ్యాఖ్యానమును రచించి, దానిని సుల్తాను