పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వించుననియు ప్రార్థించిరి. వ్యాపారలాభమే చూచుకొన్న వారగుటచే నావర్తకులు ఇంటిమాటమఱచి, చీనా దేశమునకు ప్రయాణమైరి. కుబ్లయిఖాను వారిని చూచి యచ్చెరువంది, వారి ననేక విధముల గౌరవించి ఆదరించెను. వినోదగోష్ఠి యందు, వారల రావించి, యైరోపాఖండము, అందలి రాజ్యములు, రాజులు, ధర్మపరిపాలన, రాజనీతి, మతము మున్నగు ననేకవృత్తాంతమ ల నడిగి విసుగు విరామములు లేక వినుచుండెను. అట్లు కొంత కాలమగు నప్పటికి ఆతనికి క్రైస్తవ మతము మీద నభిమానము జనించెను. అంతట తనప్రజలకు మోక్షసాధనము నుపదేశింప కొందఱి మతప్రవక్తలను క్రైస్తవమతాధిపతి పోపు పంపునా యని విచారించెను. పిమ్మట నాతడు ఆవర్తకులను తిరిగి యైరోపాఖండమునకు బోవలసినదనియు, తన రాయబారులుగా పోపు కడ కేగి, యెట్లయిన నూర్గురుమంది ప్రచారకులను మంచి పండితులయిన వారిని వాదోపవాదము సేయగల తార్కికులను, ధర్మవేత్తలను బంపవలసినదని ప్రార్థింపబంచెను.

మనవర్తకులు చీనాదేశమును వదలి యింటికి జేరునప్పటికి మూడువర్షములు పట్టెను. వారు, మధ్యధరా సముద్రపు టొడ్డుననున్న "ఆకర్" రేవును సమీపించునాటికి పోపు మరణించినవార్త తెలిసెను. నూతనముగా పీఠాధిపతి యెన్నుకొనబడునంతవఱకు వెనీషియానగరమందే కాలము గడపనెంచి వారు క్రీ.శ. 1264 వ సంవత్సరమున ఓడనెక్కి పయన