పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనీషియను వణిక్కుల నుచితరీతి సంభావించి, విశేషలాభమిచ్చి, వారిసరకు లన్నింటిని దీసుకొనెను. ఆరాజన్యుడు చేసిన గౌరవమును, ఆదరణయు నానందించుచు, వా రచ్చట రెండుసంవత్సరములుండి పోయిరి. ఇంతలో దక్షిణ తార్తార దేశీయులకును, ఉత్తర తార్తారదేశీయులకు పెద్దపోరు సంభవించెను.

అదివఱకే యింటికి పయనము గాదలచుకొనియున్న మనవర్తకులు రాజునొద్ద సెలవు గైకొని పయనమైరి. కాని యుద్ధముల ఒత్తిడి వలన, స్వదేశమునకు బోవు, బాటలన్నియు నపాయకరమైన స్థితియం దుండెను. అందువలన, వారు స్వదేశాభిగమన మప్పటికి చాలించుకొని వాణిజ్యార్థమై పూర్వాభిముఖులై, పారశీకదేశమునందున "బొకారా" నగరమును గూర్చి పయనమైరి. ఈప్రయాణము దీర్ఘమగు నెడారిగుండ సాగింపవలసి వచ్చుటచే నెంతో ప్రయాసకరమయ్యెను. మన వర్తకులు బొకారానగరమున అప్రయత్నముగ నెట్టులో మూ డేండ్లుండిపోయిరి. వా రచ్చట నున్నదినములలో కాక తాలీయముగ, చీనాచక్రవర్తి కుబ్లయిఖానుని రాయబారు లెచ్చటనుండియో స్వదేశాభిముఖులయి వచ్చుచు, కొంతకాలము బొకారానగరమున నాగుట తటస్థించెను. వారీ ఐరోపియను వర్తకులనుగాంచి, యంతదూరము దేశమున వారిని గాంచుటకు నాశ్చర్యమంది, వారిని దమ యేలిక కడకు రావలసిన దనియు, నాతడు తప్పక వారిని సముచితరీతిని సంభా