పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైరి. ఇలుసేరునప్పటికి నికోలోపోలో భార్యమరణించిన దు:ఖ వార్త తెలిసెను. నికోలో కామెవలన, మన కథానాయకుడగు మార్కో యొక్కడే జనించెను. ఆతని కప్పటికి పదియేనేండ్ల వయసుండెను. మార్కో తల్లిగతించినదాదిగా మేన మామలయిండ్లకడ బెరుగుచుండెను.

నికోలో, మాఫియోపోలోలు, పో పొకడు యెన్నుకొనబడి ప్రతిష్టింపబడునని రెండు సంవత్సరములు వఱకు వెనీషియాయందు వేచియుండిరి. కాని పోపు నెన్నుకొనుట మాత్రము జరిగి యుండదయ్యెను. అప్పటి విపరీత మత, రాజకీయ పరిస్థితులనుబట్టి పోపు యెన్నుకొనబడడేమో యని సంశయ మంది, తమ ప్రయత్నములను, రాయభారమును విఫలము లయ్యెనని విన్నవించుటకు మరల నాసోదరులు చీనాకు ప్రయాణమైరి. ఈసారి మార్కోనుకూడ వారు వెంటబెట్టుకొని జని యుండిరి. అది క్రీ.శ. 1271 వ సంవత్సరము. అప్పటికి మన మార్కోపోలోకు పదునేడుసంవత్సరములు వయసుండెను.

వారి ప్రయాణము బహుదూరము సాగకముందే, ఆకరునందున్న, మఠాధికారి, పోపుగా ప్రతిష్టింపబడినవార్త వారికి దెలియవచ్చెను. క్రొత్తపోపు కుబ్లయిఖానుని, సందేశమాలకించి, నూరుమంది ప్రవక్తలకు బదులు మువ్వురను మాత్రమంపుట కంగీకరించెను. వారును, మన యాత్రికులతో, కొలదిదూరము మాత్ర మరిగి భయపడి వెనుకకు దిరిగిపోయిరి.