పుట:Aananda-Mathamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

ఆనందమఠము


భవానంద —— ఎవఁడు ప్రజలను పాలించ లేదో, వాఁడు రాజు కాఁడు కదా!

మహేంద్ర—— మీరు రాజును ధిక్కారము చేయుట వలన ఒకప్పుడు కాకున్నను మఱోకప్పుడు సిపాయీల గుండు దెబ్బలకు గురి యగుదురు.

భవానంద——చాల మంది సిపాయీలను జూచినాను. ఈదినమునను.

మహేంద్ర —— చక్కఁగా జూచినాను జూచితివి. ఇంకొక చూడఁగలవు.

భవానంద—— ఎందులకు కాఁగూడదు, చూడఁగలను. ఒక్క తేపగాక రెండు తేపలు చచ్చుట లేదు కదా?

మహేంద్ర—— కావలయు ననీ చచ్చిన ప్రయోజన మేమి?

భవానంద—— మహేంద్రసింహా! నిన్ను మనుష్యుఁడని తలంచి యుంటిని. ఇపుడు చూడఁగా నీవు పాలు వెన్న చక్కెరకు యమస్వరూపుఁడవై యున్నాఁడవే గాని వేఱేమిఁయు కాదు. సర్పమునకు కాళ్లు లేవు; అది కడుపుతోనే జరుగుచున్నది; అంతకంటే నీచమైనజంతువును, నేనిదివఱకు చూడలేదు. ఎవరైనను కాలితో ద్రోక్కినయెడల, పడగ నైతికొని లేచుచున్నది; నీశాంతము ఇంకను పోలేదు; అదెట్టి శాంతమో దేవునికే తెలియవలయును; ఎంత దేశ మున్నదో యాలోచింపుము; మగధము, కాళి, కాంచి, డిల్లి, కాశ్మీరము "మొదలగు దేశము లెన్ని యో గలవు, ఏ దేశమునను ఇట్టి దుర్గశ లేదు. ఏ దేశస్థులు తినుటకు కూడు లేక మలమల మాడుచు కసవును గడ్డిని తినెదరు? ఆకులలములు తినెదరు? ఏదేశమున