పుట:Aananda-Mathamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఆనందమఠము


ఒక పెద్ద మేడ; ఆ యింటి సోపానములు దూరముగ నుండి చూచినను గనఁబడుచుండెను. ఆగృహారణ్యమధ్యమునందాసౌధము పర్వతశిఖరమువలె కనఁబడుచుండెను. పోయి చూడఁగాఁ కవాటబంధనము చేసియుండెను. కేవలనిశ్శబ్దము. గాలిపోనుగూడ దారిలేదు. ఇల్లు మిట్టమధ్యాహ్నమునందును చీకటిగా నుండెను. ఆచీఁకటిలో, అర్ధరాత్రిలో, వికసించిన కుసుమయుగళమువలె దంపతు లిద్దఱుకూర్చుండి యాలోచించు చుండిరి. మహాక్షామము ప్రాప్తమైనది.

వేయియు నేడువందల డెబ్బది యొకటవ (1771)సంవత్సరమునందు పంట చక్కఁగా పండ లేదు. ఆకారణముచే మఱుచటిసంవత్సరమున ధాన్యము ధర హెచ్చైనది. జనులకు మిగుల కష్టము సంభవించెను. దొరతనము వారును దమకుఁ జేరవలసిన పన్నుకై ప్రజలను కష్టపెట్టి గొడ్డుగోదలు నేలలు జప్తి చేసి వసూలు చేసికొనిరి. ఇందువలన బీదలు దినమున కొక పూట భోజనము చేయుచు ప్రాణమును బిగబట్టుకొని యుండిరి. డెబ్బదిమూఁడవ సంవత్సరమునందు మంచి వానలు కురిసెను, ఆసంవత్సరమున జనులు దేవునికి మనయెడ దయ కలిగినదని చెప్పుచుండిరి. కొందఱు కష్టము తీఱె నను కొనుచుండిరి రైతులు సంతోషముతో వ్యవసాయము చేయఁ దొడంగిరి, రైతుల భార్యలు నగలు చేయవలసిన దని భర్తలను పీడించుచుండిరి. అయినను, 'వెనుకటి పైరుచేయు కాలములో నొక చినుకైనను పడలేదు. పై రంతయు నెండిపోయెను. ఒక్క గింజయైనను చేతికి రాలేదు. ఎక్కడనో యొక చోట కొంచెము ధాన్యము పండెను. సర్కారు వారు ఆ ధాన్యమును తమసైన్య