పుట:ASHOKUDU.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము

75

ణమే ప్రజారక్షణము; 'రాజ్య రక్షణము; ధార్మిక సంఘరక్షణము; ధర్మము ధార్మిక లను గాపాడును. నీయుద్దేశము మహత్తరమైనది; సాధుసమ్మతమైనది. దేవతలు మానవుల యభిప్రాయములను, నుద్దేశములను గ్రహించి వారివారి కర్మములం గూర్చి విచారణ చేయుచుందురు. నీవిషయమునఁ గూడ నీసనాతననీతి యే యుపయోగింపబడఁగలము, బాగుగ నాలోచించి చూడఁగా నీ దుఃఖకర హత్యాసంబంధమున నీవు సంపూర్ణముగ నిరపరాధివి” అనియెను.

మహారా జగునశోకుఁ డిప్పటికి కొంత చిత్తుఁడయ్యెను. అప్పుడాతఁడు ధర్మాచార్యులకును సభ్యులకును వందనము లాచరించి మరలఁ దనపీఠము నలుక రించెను. ధీమంతులును, బ్రాజ్ఞులు నగుభిక్షు లందఱు నుపగుప్తుని ధర్మనిర్దేశమునకు సంతుష్టచిత్తులైరి. ప్రియదర్శనుఁ డగునశోకుఁడు ను మేఘముక్త సుధాకరునివలె నధికతర ప్రియదర్శనుడై ప్రకాశించెను,


ఇరువదియవ ప్రకరణము


సంస్కరణ సభ

మహా రాజుహృదయమును గ్రహించినతోడనే భిక్షు మండలికిఁ గల సకల సందేహములును వదలిపోయినవి. అనంతరము వారందఱును నశోకుని సదుద్దేశముంగూర్చి సంతుష్టు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/83&oldid=350635" నుండి వెలికితీశారు