పుట:ASHOKUDU.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

అ శో కుఁ డు

ముపై గూరుచుండు మని చెప్పెను. సభాసదు లందఱునని మేషనయనులై యానూత నాగంతుక పురుషునిం జాడ నారంభించిరి. నీలవర్ణంబును, విలక్షణంబును నగునాతని యాకారము నెవ్వరు నానవాలుపట్ట లేదు. ఆనవాగత పురుషుని యపూర్వవదనశోభయు, నలోక సామాన్య తేజోవిలసిత నయనద్వయవిరాజితంబగు వదన మ ం డ ల ము ను జూచి యందఱును విస్మితులై పోయిరి. అపురుషుని ప్రతిదృష్టి శ్రేణి నుండియు నపూర్వరాజ తేజఃపుంజములు ప్రకాశితములగు చుండెను.—— మహారాజు పీఠము నలంకరిం చెను. సభ్యు లెల్లరును దమతమపీఠముల పై నిశ్శబ్దముగఁ గూర్చుండిరి.

పంచేంద్రియ వ్యాపారమంతయుఁ గనులలోనే నిలిచి యుండుటవలన సభ్యులం దెవ్వని శబ్దస్పర్శరసగంథాను భవమగుట లేదు. సర్వ దేహశక్తులును, సర్వమనశ్శక్తులును గూడ నప్పుడోక్క కన్ను లయందుమాత్రమే యే కీభవించి యుండెను. అందఱు నేకాగ్ర దృష్టితో మహా రాజును మహాత్ముఁ డగునుపగుప్తుని జూచుచుండిరి. అప్పుడశోకుఁ డుప గుప్తుని కెదురుగ లేచి నిలు వఁబడి వినయవచనములతో బూర్వో క్తభీభత్సవ్యాపారముం గూర్చి లేచి " ఈవిషయమున నేనెంతవఱక పరాధిని?" అని ప్రశ్నించెను. ధర్మాచార్యుఁ డాద్యో పాంతముగ నెల్ల సంగతులను విని యించుక'సే పాలోచించి “మహా రాజా! నీవు ధర్మప్రాణుఁడవు. ధర్మవి జయమును సాధించుట యే నీయుద్దేశము, ధర్మరక్ష

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/82&oldid=334373" నుండి వెలికితీశారు