పుట:ASHOKUDU.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

అ శో కుఁ డు

లైరి. విశ్వాసముగల నిస్థావంతులగు బౌద్ధులు స్వార్థపరులైన కపట వేషధారులను దమబౌద్ధసమాజమునుండి తొలఁగించి వేయుటకు బద్ధకంకణులైరి. కపటాత్ముల దురుక్తులచే గర్హితంబు లగుదురాచారములను రూపుమాపుటకు వారందఱును బ్రయత్నింపసాగిరి. భగవానుఁ డగుబుద్ధ దేవుని సదుప దేశము లన్నియు నేవిధముగ లోకమున సర్వొత్తమ స్థానము నల:కరించునో యావిషయముం గూర్చి బౌద్ధధర్మాసక్తులగు వారెల్లరు నాలోచింపసాగిరి. సార్వభౌముఁ డగు నశోకుఁడు పూర్వమునుండియు నిందుల కే ప్రయత్నించుచుండెను. ఇప్పుడు సామాగ్యముగనే ధర్మ ప్రచార మును సంస్కరణమును జేయ వచ్చునని తెలిసికొనియెను. కపటాత్ముల బోధనమువలన దురాచారులగు బౌద్ధులంగాంచి విర క్తుఁడై తనయాచార్యత్వమును ద్యజియించి మధురానగరమునకుఁ బోయియుండిన మహాత్ముఁ డగు నుపగుప్తుఁడు మరల నిప్పుడు పాటలీపుత్రనగరమునకు వచ్చియుండెను.

బౌద్ధ ధర్మమును, సంఘమును వర్ధిల్లుట కనుకూల దినములు వచ్చినవి. ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులు మూడు నొక్కచో సమ్మిళితములై యుండెను. ఆశోకమహా రాజు తన సదుద్దేశము నుపగుప్తునకు నివేదిం చెరు. నైష్ఠికులును, ధర్మైక జీవనులు నగు భిక్షులు తమతమ యభిప్రాయములను ధర్మాచార్యునకు విశదీకరించిరి. అందఱయభిప్రాయములను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/84&oldid=334618" నుండి వెలికితీశారు