పుట:ASHOKUDU.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము.


సంధిసమయము.

పాటలీపుత్రమునఁ గొన్ని దినములవఱకును విజయోత్సవములు జరిగినవి. క్రమముగా నుత్సవోచ్ఛ్వాసములు తగ్గ నారంభించెను. ఆనందతీవ్ర ప్రవాహములు మందీభూతములగు చుండెను. గజతురంగ పదాతి గణంబుల కిఁక నిప్పుడు యుద్ధ యాత్రానుకూపంబులగు వేష భూషణము లెంతమాత్రమును లేవు. నగరతోరణములయందలి పత్ర పుష్పమాలికలు వాఁడి పోయినవి. పట్టణమంతయు బూర్వమువలె నెమ్మదితోనుండెను; దూరమునుండి రణ భేరీధ్వనులనాలకించి యుద్ధయా త్రామహోత్సవముం జూడవలయు నను నుత్సాహముతో, గుల వధూజనము గృహ కార్యములను విడిచి గవాక్షములయొద్ద నిలిచియుండుట లేదు; వృద్ధులగువార లింటిముంగిలి దాటివచ్చుట లేదు. యౌవనులు స్వకార్యములను వదలి వీధుల వెంటఁ దిరుగుట లేదు. బాలకులు తమపు స్తకములను బాఱవై చి వీథుల లోనికిఁ బరు గెత్తుకొని వచ్చుట లేదు. ఇప్పుడు నగరజనులందఱును నెమ్మదితోఁ దమతమ పనుల నిర్వహించుకొనుట కారంభించిరి. 'రాజధానియందును రాజస్థానమునందును మరలఁ బూర్వావస్థ నెలకొనియెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/66&oldid=350125" నుండి వెలికితీశారు