పుట:ASHOKUDU.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము

59

రాజ్యమంతటను బ్రజలందఱునుబూర్వరీతిని నెమ్మదితోనుండిరి, కాని మహా రాజగు నశోకుని మనో భావము మాత్రము యథాపూర్వముగ నున్నట్లగపడుట లేదు. ఇంత కాలమువఱకు మహా రాజగునశోకుఁ డెట్టిస్థియం దుండెనో యితరులుకూడ నా స్థితియం దేయుండిరి. తనహృదయమునం దెట్టివిషమచ్ఛాయ ప్రసరించుచుండెనో యింతకాలమువఱకు నశోకుఁడు గ్రహీంపఁ జాలక పోయెను. ఆమహారాజుముఖమండలమున నా ఛాయ యావరించి యున్నట్లితరులు కూడ నెవ్వరును గను పెట్ట లేక పోయిరి. ఇప్పుడు ప్రజల కండఱకును మంచిసమయము వచ్చినది. అందు చేత నే యశోకుఁడు తన హృదయమునఁ బ్రసరించియున్న విషమచ్ఛాయను బాగుగ గ్రహింపగలిగెను. మంత్రులుకూడ నా సంగతిని దెలిసికొనఁ గలిగిరి. మహా రాజగు నశోకుని వాక్యోపవాక్యములవలనను, కాచార వ్యవహారములవలనను, నా దేశోప దేశములవలనను నాతనిభావ వై లక్షణ్య మెల్ల రకును స్పష్టముగ బోధపడుచుండెను.

క్రమముగ మంత్రులందఱు నీ విషయముంగూర్చి యాలో చింప నారంభించిరి. ఒక నాడు మహారాజు దైనందిన రాజకార్యములు నిర్వర్తించుకొని సభచాలించి నగరు నకుఁ బోయెను. తరువాతఁ గొలఁది సేపటిలోన నే మంత్రులందఱు నాస్థానమునుండి వెలుపలకు వచ్చిరి. వారిలో నొకడు "అంతః పురమునం దేదియో జరిగియుండును” అని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/67&oldid=333932" నుండి వెలికితీశారు