పుట:ASHOKUDU.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాఱవ ప్రకరణము

57

తరంగ నిర్ఘోషమును స్తబ్ధీ భూతముగఁ జేసి వైచెను. రణధరణీ తలమున శోణిత వాహినులు ప్రవహించెను. ఈ విధముగఁ కొన్ని దినములు గడచిన పిమ్మట యుద్ధము ముగిసెను. ఆవిశాల జన పద మంతయు నశోకునియధీన మయ్యెను. కాని దేశము జనశూన్యమైపోయెను. అప్పుడశోకుఁడు రథారూఢూఁడై రణ క్షేత్రమును బరీక్షించెను. ఆభీభత్సదర్శనమున నాతని హృదయ మత్యంత వ్యాకులిత మయ్యెను. ఆ కారణము చే విజయలక్ష్మి యాతనికుల్లాసముక లిగింపఁజాలక పోయెను ఇంతియ కాదు— ఆతనికించుకంతయూరట యైనగల్పింప లేకపోయెను. తన రాజ్యలోభముచే ననేక జనసంఘములు నాశనము లైపోయెఁగదా యని యప్పుడాతఁడను కొనియెను. అందుచే నాతడు మర్మ భేదనంబగువిచారము ననుభవించెను. కాని, యాతఁడాయాంతరికపరి వేదనము నెవ్వరియొద్దను బ్రకటించియుండ లేదు. తదనంతర మాయశోకుఁడు కళింగరాజ్య సింహాసనమునందా ప్రభువు నే మరల బ్రతిష్ఠించి దేశపరిపాలనమున కనుకూలవ్యవస్థలం గావించి స్వదేశమునకు మరలెను . కోలది కాలమున కే యశోకుఁడు రాజధానింబ్రవేశిం చెను. అప్పుడు రాజధాని నగరమున యథావిధిగా విజయోత్సవములు గావింప బడి యెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/65&oldid=333925" నుండి వెలికితీశారు