పుట:ASHOKUDU.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

34

ఇప్పుడు మహా రాజగు బిందుసారుని రాజ్య సమయమున దక్ష శిలయందు విద్రోహములు బయలు వెడలెను. సామంత రాజులు తమలోఁదాము కలహించుచుండిరి. రాజ్యలాల సత్వమే యిందులకుఁ బ్రధాన కారణము—— మఱియుఁ బ్రజా విద్రోహము మఱియొక విధముగ నుండెను. రాజోద్యోగుల దోషములవలనను, వారికఠిన శాసనముల వలనను, దుష్ట కృత్యములవలనను దూరదృష్టి లేని ప్రజలు విద్రోహు లగు చుండిరి. రాజగు బిందుసారుఁ డీ విద్రోహవా ర్తల నాలకిం చెను. మొట్టమొదట నాతఁడు యువ రాజగు సుషీముని ససైన్యముగ నా స్థలమునకుఁ బంపించెను. ప్రప్రథనుమున బ్రజలందఱును యువరా జగు సుషీ మునింగాంచి యించుక శాంతివహించి యుండిరి. యువ రాజు తమ తమ కష్టములం, గూర్చి యాలకించి యందులకుఁదగిన ప్రతిక్రియల నాచరించునని వారికి మిగుల నమ్మకముకలిగెను. కాని యచిర కాలము నందే వారి కాబ్రమ యంతయు వదలిపోయెను. అప్పుడు ప్రజలందరును యువ రాజు తీవ్రాస్త్రములమూలమునను గఠినశాసనముల మూలమునను దమ్ముదండించుటకై వచ్చియుండేనని భావించుకొనిరి. అందువలన మరల వా రెప్పటివలె నల్లరులం జేయుట కారంభించిరి. యువ రాజు శాంతి స్థాపనమునకై చేసినయాత్ర యీవిధముగ నిష్ఫలమైపోయెను. అందుచే నాతఁడు నిరర్థకముగ స్వదేశమునకు మరలవలసిన వాఁడయ్యెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/43&oldid=333547" నుండి వెలికితీశారు