పుట:ASHOKUDU.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

అశోకుఁడు

మహారా జగుబిందుసారుఁడు పుత్రముఖంబున నెల్ల సంగతుల నాలకిం చెను. అప్పుడాతఁడు తనతప్పును దా నే తెలిసికొనఁ గలిగెను. తోడనే యామహా రాజకుమారుఁ డగునశోకునిఁ బిలిపించెను. పిమ్మట బిందుసారుఁ డశోకున కెల్ల వృత్తాంతమును జెప్పి యేమేమి చేయవలయునో కూడఁ దెలియఁజేసెను. రాజ్యమున కతిదూరమునఁ బశ్చిమ ప్రాం తమునందు శాంతి స్థాపనము కొఱకు—విద్రోహదమనము కొఱకుఁగాదు—— కుమారున కేమి కావలయునో తండ్రి యన్నియు నోసంగెను-- కేవల మస్త్రములను సైన్యముమాత్ర మాతని కీయ లేదు. అశోకుఁడు తండ్రి యభిప్రాయమును గ్రహియిం చెను. ఆతఁడు నిర్భయుఁడై తక్షశిలకుఁ బ్రయాణమయ్యెను. కొలఁదికాలమునం దేయనోకుఁడు నిరపాయముగఁ దక్షశిలం బ్రవేశించెను. అచ్చటి ప్రజల కందఱకును బ్రేమ పూర్వకముగ దర్శన మొసంగెను; వారికష్టసుఖంబులఁ బరిశీలించెను; వారియభియోగ కారణముల విస్పష్టముగ గ్రహించెను; వారికష్టములయెడల సహానుభూతిని బ్రకటించెను; కష్టని ర్వాపణమునకుఁ దగిన ప్రతి క్రియలం గావించెదనని చెప్పి వారిమనంబుల కూఱట కలిగిం చెను. రాజపుత్రుఁడు శస్త్ర ములనుగాని, సైన్యమునుగాని తీసికొని రాలేదనియుఁ, దమ్ము దండింపవలయు ననును ద్దేశముతో వచ్చిన వాఁడు కాఁడనియుఁ, దమలో శాంతి స్థాపనము చేయుటకే దర్శనమిచ్చి యుండెననియుఁ బ్రజలందఱును మొట్ట మొదటనే భావించి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/44&oldid=333548" నుండి వెలికితీశారు