పుట:ASHOKUDU.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

అ శో కుఁ డు

శోభితంబగు ధరణితలంబున నుపన సించితిని; అదియే సర్వోత్కృష్ట మృదులాసనము. నేను వినిర్మలస్నిగ్ధ పావన గంగాజలంబులఁ బానము చేసితిని; అదియే సర్వోత్తమ పానీయము. కావున మహాత్ముఁ డగు నా పింగళ వత్స జీవుని వాక్యములు సత్యము లే యైనచో నేనే భవిష్యత్కాలమునందుఁ బితృసింహాసనమును బొందఁగలుగుదును.

మాతాపుత్రుల ప్రియ సంభాషణ మీ విధముగ జరిగినది. అది మొదలుగ వారిహృదయము లాశాన్వితము లగుటచే భవిష్యత్సుఖసమయమునకై వా రిరువురు నెదురు చూచుచుండిరి.


పదియవ ప్రకరణము

జనకుని యాజ్ఞ

మహా రాజగు చంద్రగుప్తుడు తన బుద్ధి బలమునను బాహుబలముననుగూడ మగధ రాజ్యమును జాలదూరము వఱకును వ్యాపింపఁ జేసెను. ఆ కాలమునం దక్షశిల మగధ రాజ్యాంతర్గత మైయుండెను. చంద్రగుప్తుఁడు తా నెంతవఱకుఁదన రాజ్యమును విస్తరింపఁ జేసెనో యంతవఱకుఁ దన సత్య శాసనమునుగూడఁ బ్రసరింపఁ జేసెను - కాని ఎల్ల కాలము నొక్కరీతిగా నుండదు. ఎల్ల దినములు నొక్కలాగున జరుగవు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/42&oldid=349946" నుండి వెలికితీశారు