పుట:ASHOKUDU.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

33

చించెను. ఈ “యశోకుఁడు మహా రాజునకుఁ గేవల మప్రియుఁడు, సర్వవిధములను రాజసింహాసనమున కశోకుడే యర్హుడని చెప్పినచో నది యాతనికి మిగులఁ బ్రతికూలముగఁ బరిణమింపఁగలదు. కావున మిగుల నిపుణముగ మహా రాజునకు సత్యమును బ్రదర్శింపవలయును” అని నిశ్చయించుకొని "మహాప్రభూ ! నే నీ రాజకుమారుల నందఱను బరీక్షించితిని. వీరిలో నెవ్వరివాహనము సర్వవిధముల నున్నత మైనదో, యెవ్వరిపీఠ మెల్ల రీతుల నుత్కృష్టమైనదో, యెవ్వరి పానీయ మెల్ల భంగుల నుత్తమమైనదో వారే సర్వ విధములను భవిష్యత్ప్రభుత్వమున కర్హులు ” అని చెప్పెను.

ఆ మాటలనాలించి రాజకుమారులందఱును బ్రత్యేకముగఁ దమలోఁదా మాలోచించుకొని తమ తమ యాసన పానీయము లే యితడల వానికంటే శ్రేష్ఠములని నిశ్చయించుకొనుచుఁ దమ యిచ్చవచ్చిన తెఱంగున సిద్ధాంతము చేసికొనఁ జొచ్చిరి. కురూపియగు నశోకుఁడు సభ ముగిసిన తరువాతఁ దల్లి యొద్దకు వచ్చి పింగళవత్సజీవుఁ డొనరించిన నిర్దారణముంగూర్చి యెల్ల సంగతులను దెలియఁ జేసెను. అనంతర మశోకుఁడు తల్లి యెదుటఁ బింగళవత్స జీవుని వాక్యముల కీవిధముగ వ్యాఖ్యానముం గావించేను.—— నేను పితృపి తామహోచితంబగు వృద్ధ భద్రగజము నధిరోహించి పోయితిని; అదియే సర్వోన్నత వాహనము. నేను శ్యామల దూర్వాదళ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/41&oldid=333542" నుండి వెలికితీశారు