పుట:ASHOKUDU.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

అ శో కుఁ డు


బిందుసారుని యేకాధిక శత పుత్రు లలోఁగూడ నాతని ప్రథమ మహిషీ తనయుఁడగు యువరాజు సుషీ ముఁ డొక్కఁడు మాత్రమే ప్రియతముఁడై యుండెను.

ఎవ్వ రేమనుకొన్న నేమి ? సుభద్రాంగి మాత్రము కన్నబిడ్డ యగునశోకునిం జూచి యెల్ల కష్టములను మఱచిపోయెను. ఆమె ప్రేమోపచారములచే నశోకుఁడు శుక్ల పక్ష చంద్రునివలె దినదిన ప్రవర్ధమానుఁ డగుచుండెను.బాలుఁడగునశోకుఁడు తనను 'రూపముంగూర్చి చెప్పుకొనువారి మాటలయర్థ మెంతమాత్రమును గ్రహియించియుండ లేదు, కేవలమాతఁ డెన్నఁడు నొక్కనిమిషమందైన దుఃఖించి యుండ లేదు, అశోకుఁడు రాజగృహమునం గలయెల్ల రాజ కుమారులతోడను సమా నానందముననే_ సమానోత్సాహమున నేయాట లాడుకొనుచుండెను. క్రమముగ నశోకునకుఁ బసితనము వదలుచుండెను. బాలకుఁడగున శోకున కప్పుడు విద్యాశిక్ష ప్రారంభ మయ్యెను. క్రమముగ , నాతనికి లోకజ్ఞానము కలుగుచుండెను. అప్పటినుండి యే బాలకుఁ డగునశోకుఁడు తనతండ్రిచర్యలయందలి పక్ష పాతమును గ్రహించియుండెను. ఆ రాజగృహంబున నాచఁద్రశాలామంటప మధ్యమున నవవికసితశతశతపత్రంబులం బోలి విలసిల్లుచున్న తన కుమారులనడుమ భ్రమర నీలవర్ణుండును, శోభా సౌరభహీ నుండును గురూపియు నగునశోకుని జూచినప్పుడు బిందుసారుఁడించుక యప్రతిభుఁ డై పోవుచుండెను—తుదకు విరక్తుఁడై .

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/36&oldid=333435" నుండి వెలికితీశారు