పుట:ASHOKUDU.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

27

యప్పుడాతనికన్నులలోఁ, జేమరసతరంగములు పొడసూపలేదు; ఆతనిముఖమండలమున నానంద కౌముదీవిలసన మగపడ లేదు. కేవలమప్పుడాతఁడు ధనర త్నాదికముల దానము చేసి కుమారుని నాశీర్వదించి మాత్రము వెడలిపోయెను. సుభద్రాంగి యిదియంతయును బరిశీలించి చూచుచు నే యుండెను. మఱికొందఱు పరిచారికలుకూడ నా భావమును గ్రహించియుండిరి.

ఒక్క నిముసములో నీ సంగతి యంతయును సుభద్రాంగి సవతుల చెవులఁ బడియెను. మహా రాజు దాసీనుఁడై యుండెనని వినుటవలన వారియీర్ష్యానల మించక శాంతిం చెను. ఆ రాణులలో నొక్కరొక్క రొక్కొక్క విధముగఁ జెప్పుకొన సాగిరి. తుదకు వారందఱు గర్వితురాలైన సుభద్రాంగికిఁ దగిన శాస్తియైనదని నిశ్చయించుకొనిరి. “ఎంతగర్వము !ఇంతటి గర్వము ధర్మా దేవి యెట్లు సహించినదో? ——దర్పహారి యగుమహారాజు సుభద్రాంగి దర్పభంగమును బాగుగఁ గావించినాఁడు—— ఇప్పటికిది ప్రథమసూచనామాత్రము” అని యనుకొనిరి. కాని ప్రకృత స్థితి యది కాదు. సుభద్రాంగియపరాధమేమనిన:- ఆమెకుమారుఁ డితర రాజకుమారులవలె సుంద రుఁడు కాఁడు, ఇంతియ కాక చూపులకు మిగులఁ గురూపియైయుండెను. అతని కంతగా నంగ సౌష్టవము లేదు. అతనిశరీరచ్ఛాయ గౌర వర్ణ విలసితమై యుండ లేదు.

ఈసకలకారణముల చేతను రాజప్రథమదృష్టి, యశోకకుమారునిపై ఁ బ్రేమప్రపూర్ణముగఁ బ్రసరించినది కాదు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/35&oldid=333434" నుండి వెలికితీశారు