పుట:ASHOKUDU.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

29

పోయెను. బాలకుఁ డగునశోకున కాసంగతి యంతయుం దెలిసి పోయినది. కాని యందులకుఁ గారణముమాత్ర మాతనికి బాగుగ బోధపడ లేదు. ఆశోకుడు తల్లి యొద్దకు వచ్చి యావిషయముఁ గూర్చి యడుగునప్పుడు సుభద్రాంగి మఱియొక ధోరణిలో నాతని కామాట మఱపించి వైచుచుండెను.

ఈసకల కారణముల చేతను సుభద్రాంగి భర్తృప్రియత ము రా ల య్యు ను, నిరంతర చింతా సంతప్తహృదయయై యుండెను. కుమారునియెడలఁ దండ్రికిం గల యింతటి యుదాసీనత-ఇంతటి యసహ్యభావము తుద కేవిధముగఁబరిణ మించునోయని యామె నిరంతరము విచారించుచుండెను.

అశోకునియెడల బిందుసారున కిట్టి యసహ్యభావమున్నదని తెలియనివా రెవ్వరును లేరు. ఏమైన నేమి? జనకుని యింతటి యసహ్యభావము కుమారుఁడగు నశోకుని కులోచిత విద్యాశిక్షణమునకుమాత్ర మెంతమాత్రమును వ్యాఘాతముం గల్పించి యుండ లేదు.అది యేమోకాని యశోకుఁడు తన వై మాత్రేయసోదరులకంటె నల్ప కాలము నందే యధిక విద్యావంతుఁ డగుచుండెను; సకలవిషయముల యందును విజ్ఞాన లాభము నందుచుండెను; కుమారుని కుశాగ్రబుద్ధిం గూర్చిన ప్రశంసావచనముల ప్రతిధ్వనులు క్రమముగాఁ దల్లి చెవులఁ బడుచుండెను. అందు చే సుభద్రాంగి పరమానంద భరితహృదయ యగుచుండెను,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/37&oldid=333530" నుండి వెలికితీశారు