పుట:ASHOKUDU.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

21

చుండెను. ఈవిధముగ నామె సుభద్రాంగికి సర్వవిధముల మంగళా కాంక్షిణియైయుండెను.

యమునా సుభద్రలు శుభసమయమున కెదురుచూచు చుండిరి. దినము గడచిపోవుచుండెను; రాత్రియును గడచి పోవుచుండెను. మాసములును వత్సరములు ను గూడఁ గడచి పోవుచుండెను. కాని శుభసమయచిహ్నమైనను వారి కగపడుట లేదు. తుద కొకనాఁడు మంచిసమయము దొరకెను.

అది ఫాల్గున మాసము- పూర్ణిమా రాత్రి రెండవజాము గడచిపోయినది. మందమంద మారుతములు వీ తెంచుచుండెను. ఆ వాతపోతస్పర్శనమున నోడలు పులకించుచుండెను. సమీప వ్రుక్షాంత రాళమునందుండి యొకకోకిలతనకలకుహూస్వరంబున నమృత సేచనముఁ గావించుచు దిగంతముల నమృతం సప్లావితములుగఁ జేయుచుండెను, పూర్ణ చంద్రుడు వెన్నెలలఁ గ్రుమ్మరించుచుండెను. ఆ మధుర కుహూనినాదమును, నావి నిర్మల కౌముదీ విలాసమును, నేకీభవించి తమ మోహినీదిశక్తిచే లోకమును ముగ్ధప్రాయముగఁ జేయుటకుఁ బ్రయత్నించుచుండెను—— మహా రాజాధి రాజులు మహా వైభవసంపన్నులే యై యుందురు; కాని వారికొక్క విషయమున మాత్రము గర్భదరిద్రులకంటెను మించిన దారిద్ర్యము కలదు. ప్రకృతి సౌందర్యమును కాంచు భాగ్యము వారికిఁ దఱచుగ లభియింపదు. వారు చార ముఖంబున నెల్ల వార్త

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/29&oldid=333024" నుండి వెలికితీశారు