పుట:ASHOKUDU.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

అ శో కుఁ డు

నామెయెడల సహానుభూతిం జూపుచు మంచి చెడ్డలను గూర్చి నివేదించుచుండిరి.

లోకమునం దనేకవిధముల గుజను లున్నారు, కొందఱు జరిగిపోయిన దానిం గుర్చి: విచారించుచుందురు. కోందఱు వర్తమానముం జూచుకొనుచు నానందించుచుందురు. మఱి కొంద ఱతీతవర్తమానములయందు విరక్తులై కేవలము భవిష్యత్కాలముకొఱకే తలయెత్తుకొని చూచుచుందురు. రాజాంతః పురమున యమున యను పేరుగల పరిచారిక యున్నది. ఆమెవయసు నలువదియేండ్లకు మించి యుండును. ఆమె రాజాంతః పురమునందలి యెల్ల సంగతుల నెఱుంగును. అనేకుల నామె బాగుగ నెఱుంగును; వారిస్వభావములఁ గూడ నెఱుంగును. మఱియు నామె రాజస్వభావమునుగూడ నామూలముగ నెఱుంగును. సుభద్రాంగి రూపలావణ్యమును గూర్చియు నామె గుణగణములను గూర్చియు నామె తనలో “ఇట్టిరూపమును, నిట్టిగుణములు నుగూడ నెప్పుడను వ్యర్థములు కాజాలవు. ఎప్పుడో యీమె కొకశుభదినము రాఁగలదు. కావుననే యిప్పటినుండియు నీమెతో మైత్రి సంపాదించుకొందును. కష్టకాలమునందుఁ గావించిన యుపకార మెన్నటికి నెవ్వరును మఱచి పోఁజాలరు” అని యీ విధముగ నాలోచించుకొని యమున సుభద్రాంగిని ప్రత్యక్షముగను నప్రత్యక్షముగనుగూడ సేవించుచుండెను—— ప్రేమించుచుండెను; ఆమె కష్టసుఖములు తనవిగ భావించుకొను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/28&oldid=333023" నుండి వెలికితీశారు