పుట:ASHOKUDU.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

అ శో కుఁ డు

లను వినుచుందురు, చాటు కారులవలన గుణపరిచయము గావించుకొనుచుందురు. చిత్రరూపముల మూలమున సౌందర్యమును భావించుకొనుచుందురు. ఒక్కరును సుఖముగ నుండుటకు వారి కెప్పటికో గాని సమయము దొరకదు. నిరంతరమును బార్శ్వచరుల చేఁ బరి వేష్టింపఁబడి వారికర్ణముల తోడ నే వినుచు వారి దృష్టులతోడ నే చూచుచు నుందురు- ఇప్పుడొక్కించుక సేపు మహా రాజగు బిందుసారుఁడట్టి పరాధీనతా హస్తములనుండి విడివడి యొక పుష్పారామమధ్యమునం బ్రచారము చేయుచు నే మేమియో భావించుకొను చుండెను.

ఆసమయమునం దాకస్మికముగ నొకయువతీమూర్తిచ్చటకు వచ్చెను. ఆమె యతిలోక సుందరీమణి—— మహారాజుదృష్టి యింకను నామె పై ఁ బ్రసరించియుఁ బ్రసరింపక మునుపే యారమణీమూర్తి మహా రాజపాదపద్మ సాన్నిధ్యమున సాష్టాంగపడి యుండెను. ఆ సందర్భమున సార్వభౌముఁడించుక యులికిపడియెనుగాని యొక్కింత సేపటిలో స్థిర హృదయుఁడై యామెనుజూచి " లెమ్ము ! నీ కోరిక యేమి యో తెలుపుము !" అని యాదరముతోఁ బలికెను. అప్పుడు సుభద్రాంగి తనచరిత్రమంతయు నాప్రభుచందునకు విన్నవించెను. బిందుసారున కప్పు డెల్ల సంగతులు నింతలో స్మృతికి వచ్చెను. ఆమెయెడలఁ దన భార్యల దఱును జేసిన మోసము

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/30&oldid=333428" నుండి వెలికితీశారు