పుట:ASHOKUDU.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యొకటవ ప్రకరణము

133

సంగతి యంతయును సంపూర్ణముగ గ్రహించి సార్వభౌముడగు నశోకుఁడు మర్మాహుతుఁ డయ్యెను.

ఒకనాఁడు మహా రాజు ప్రేమాశోకుఁడు విషణ్ణ భావముతోఁ గూర్చుండియుండగాఁ మంత్రియుగు రాధాగు ప్తుఁడు వచ్చి యాతని యవస్థంజూచి కృతాంజలియై 'మహారాజా! ఈ విధముగ విచారాయత్తులై యుంటి రేల? ' అని ప్రశ్నించెను. అందు పై మహారాజు రాధాగుప్తా ! నాకు గోశము పై నధికారము లేదు. ఈ విశాల రాజ్యమునకు రాజరాజేశ్వరుఁడనయి యున్నను నా కొక్క కాసునకు గతి లేకుండఁ బోయినది ! నా కోరిక తీరినది కాదు ! నేను బౌద్ధసంఘమున కీయ దలఁచిన

శతకోటి స్వర్ణముద్రలను నీయఁజాలక పోతిని——వ్యర్ధుఁడనై నే నిప్పు డేమి చేయగలను? ఋణవిముక్తుఁడ నగులకు సాధన మేమున్నది? ఇదిగో ! నా యొద్ద నొక్క యుసిరిక కాయ మాత్ర మున్నది ! మంత్రి శేఖరా ! నీ వీయా మలకమును దీసికొనిపోయి కుక్కుటా రామమునందున్న బౌద్ధ సంఘమున కర్పింపుము ! అచ్చట నున్న పూజ్యులగు మహాత్ముల కందఱకు నిదియే యశోకుని తుది దానమని నివేదింపుము? అందఱును దయతో దీనిని బరిగ్రహించి సమముగ విభజించుకొనవలయునని నేను ప్రార్థించినట్లు వారితో మనవి చేయుము ! అని చెప్పెను.

ఇట్లు చెప్పి మంత్రి కాయామలకము నిచ్చుచు నశోక సార్వభౌముఁ డొక దాన శాససమును వ్రాయించెను. మహా