పుట:ASHOKUDU.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

అ శో కుఁ డు

రాజగు నశోకుఁ డీదానపత్రమున సముద్రమేఖలావలయితంబగు నాతని విశాల రాజ్య ముంతయును బౌద్ధసంఘమునకు దానము చేసి వైచెను. ఆ సమయమునందే యాతడు తన యాత్మ మంగళమునకై యీ విధముగఁ బ్రార్థించెను.

"నే నిప్పుడు నా రాజకోశము కాక తక్కిన రత్న రత్నాకర విశోభిత విశాల రాజ్య మంతయును భగ వానుఁడగు బుద్ధ దేవుని భక్తసంఘమునకు దానము చేసివై చితిని,—— ఈ దానమునకుఁ బ్రతిఫలముగ నే నెట్టిసుఖమును గోరుకొనుట లేదు—— ఇంద్రాధిపత్యము నభిలషింప లేదు. బ్రహ్మ లోకమును వాంఛింపలేదు. ఇవి యన్నియును నలినీదళ గత జల చంచలములు ! క్షణభంగురములు ! చిత్త పరిశుద్దింగోరి దృఢవిశ్వాసము —— నభిలషించి ఆత్మసంయమ లాభమును వాంఛించి నేనీదానముం గావించితిని ——ఇది యే నా యాత్మ మంగళము ! "

ఇట్టి ప్రార్థనమును ప్రకటించి యశోక సార్వభౌముఁ డాతని సర్వస్వమును ద్యజించి వైచెను. ఆ ముహూర్తము నందే యాతఁడు తిరోహితుఁడై పోయెను.


వందనము

అనంతసాగరపక్షమున సంపూర్ణ జ్యోతిర్మయ సూర్య మండలముం బోలి యనంత కాల సముద్రమున మహిమా