పుట:ASHOKUDU.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

అ శో కుఁ డు

ఒకనాఁ డశోక సౌర్వభౌముఁ డుపగుప్తునివలన నఖిల ధర్మముల నాలకించుచు "మహాత్మా! భగవానుఁడగు బుద్ధ దేవుని మ తాభివృద్ధికొఱకై యే పుణ్యాత్ముఁడు విశేష ధనమును దానము చేసియుండెనో సెలవీయవలయును" అని ప్రశ్నించెను. అందుపై నుపగుప్తుఁడు "మహా రాజా ! శ్రావస్తీ నగర వాసి యగు ననాథపిండుఁడగు శ్రేష్టి యొక్కడే యా విషయమున నందఱకంటెను విశేషముగ ద్రవ్య దానమును జేసియున్నాఁడు ” అని చెప్పుచు నాతఁడు చేసిన దానమున నన్నిటను విస్పష్టముగ వివరించెను. ఆ మాటలు విని యశోకుఁడు " నే నా విషయమున నూఱుకోట్ల సువర్ణ ముద్రల దానము చేయుదును; ఇంతకుఁబూర్వమే తొంబదియారుకోట్ల ముద్రలను వినియోగించితిని, ఇఁకఁ దక్కిన నాలుగుకోట్ల ముద్రలనుగూడ వెచ్చించెదను” అని చెప్పి యంతటి నుండి యశోకుఁడు ప్రతిదినమును దన యాహా రాంతము నఁ దన స్వర్ణ భోజన పాత్రమును బౌద్ధసంఘమునకుఁ బంపి వైచు చుండెను. ఇంతియగాకయ నేక విధముల దానములను గావించు చుండెను. క్రమముగ నీసంగతి యువ రాజునకును కర్ణ గోచర మయ్యెను. ఈ విధముగమహారాజు దానము చేయుచుండినచో రాజకోశ మచిర కాలములోనే శూన్యము కాఁగలదనియాతఁ డూహించు కొనియెను. పిమ్మట నాతఁడు మహా రాజునకు స్వర్ణ భోజన పాత్రను బంపుట మాన్పించి రౌప్య పాత్రను బంపునట్లా జ్ఞాపించెను; తుద కదియును లేకుండఁ జేసెను. ఆ