పుట:ASHOKUDU.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము

103

కునకును సామంత రాజ్యములలో నొక్కటియయ్యెను. కళింగమును జయించిన తరువాత నాతఁడు తన పూర్వరాజ్యము నింకను వృద్ధి చేయవలయు నను రాజ్య కాంక్షను వదలి యుద్ధ విగ్రహములను విరమించి వైచెను. ఒక్క ద్రవిడ దేశము సందలి కొంత భాగముగాక భారత వర్ష మంతయు నశోకునకు సామ్రాజ్యమై యుండెను. ఇప్పటిదొరతనము వారి భారత సామ్రాజ్యము కంటె నశోకుని రాజ్యమే చాలఁ బెద్దదిగా నుండెను. ఉత్తరమునఁ గాంధారము మొదలు కాబూల్ స్థానమునుండి దక్షిణము న కన్యాకుమారి పర్యంతమును, బశ్చిమమున సౌరాష్ట్రము మొదలు తూర్పునఁ దావ్రేలిప్త వఱకును నశోక సామ్రాజ్యము వ్యాపించియుండెను. ఇది యంతయు నాతని యధికారమునకు లోబడియున్న దేశమై యుండెను. కాని యీ దేశమున కావలనున్న దేశములయందుఁ గూడ నాతని పుణ్యప్రభావము వ్యాపించియుండెను, ఉత్తరమున నేపాళము, టిబెట్టు, దక్షిణమున సింహళము, తూర్పున బ్రహ్మ దేశము (బర్మా) వఱకుఁగూడ నాతని పుణ్య ప్రభావము సుప్రసిద్ధమైయుం డెను. ప్రాణ్యోతిష మండలమున(ఆసామ్ ప్రదేశము) బుధ్ధమత ప్రచార మేమియు నున్నఖగపడదు. ఒక్కమాటలోఁ జెప్పవలసివచ్చినచో ఆసాము, బర్మాకాక తక్కిన సాగర మేఘలాహిమాద్రిశోభిత సమస్త సమగ్ర భారతవర్ష మును నశోకుని సామ్రాజ్యమే యైయుం డెనని పరిగణింపవచ్చును. ఈ విశాల భూమండలమునఁ బల్లెలు