పుట:ASHOKUDU.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము


అశోకసామ్రాజ్యము

సౌభాగ్యమయం బగు భూఖండమున మహా భాగుఁడగు నశోక సార్వభౌముని పుణ్యప్రభావ మెంతటి యౌన్నత్యమును వహించియుండెనో యెంతదూరమువఱకు వ్యాపించి యుండెనో యాసంగతి యావశ్యకముగఁ దెలిసికొనవలసి యున్నది. మౌర్యప్రభుఁడగు చంద్రగుప్తుడు భారత సామ్రాజ్యమునకుఁ జక్రవర్తియైయుండెను. అతని పుత్రుఁడు బిందుసారుఁడు. తండ్రి యనంతరమున బిందుసారుఁ డీవిశాల రాజ్యమునకుఁ బ్రభుడయ్యెను. బిందుసారుని యనంతరమున నాతని కుమారుఁడగు నీ యశోకసార్వభౌముఁ డఖిల రాజ్య భారమును వహించియుండెను. అతఁడు పితృపై తామహంబగు రాజ్యమంతయును గరగతము చేసికొనియుండెను. అంతియేకాక యిదివఱకుఁ దమపూర్వులకు లభియింపని కళింగ రాజ్య మునుగూడ నశోకుఁడు స్వీయ బాహుబలముచే సంపాదించి యుండెను. ఏ కారణము చేతనో యా కళింగ రాజ్యము నశోకుడు తన పరిపాలనమునం దుంచుకొనక పూర్వప్రభున కే దాని నోసంగి యాతని దన సామంతప్రభునిగాఁ జేసికొనియెను. అప్పటినుండియుఁ గళింగము సార్వభౌముఁడగు నశో