పుట:ASHOKUDU.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

అ శో కుఁ డు

మొదలు పట్టణముల వఱకును, స్థలపథములయందును, జలపథములయందును సర్వప్రదేశములయందును జనోపయోగకరంబులగు కార్యముల నెన్నిఁటినో సార్వభౌముఁ డగు నశోకుఁడు గావించియుండెను.


ఇరువదియాఱవ ప్రకరణము


దే శ స్థి తి

అశోకుని ప్రభుత్వమునందు మొదటఁ గొంత కాలము వఱకు దేశమునం దశాంతికలిగెను. కళింగ యుద్ధము కూడ నట్టి యశాంతి కారణములలో ముఖ్యమైనదిగా నుండెను. కళింగ విజయానంతరమున నాతని ప్రభుత్వములో ముఖ్యముగ ను ల్లేఖింపవలసిన యశాంతి కారణము లేవియును లేవు.

రాజ్యాధి కారముకొఱకు యుద్ధము చేయుట యావశ్యకము. కాని ప్రజా హృదయ రాజ్యాధి కారముకొఱకు మాత్రము శాంతి స్థాపనము ముఖ్యా వశ్యక మైనది. ప్రజావత్సలుఁడగు ధర్మాశోకుఁ డీసత్యమును గ్రహించియుండెను. అందుచేత నే యాతఁడు మిగులఁ బరిశ్రమ చేసి తన విశాల సామ్రాజ్యమున శాంతి స్థాపనము గావించెను. దేశమునం దంతటను శాంతి నెలకొని యుండుట చేఁ గృషి వాణిజ్యాదులును శిల్పాది