పుట:ASHOKUDU.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

అ శో కుఁ డు

"దేవతా గణ ప్రియదర్శనుఁడగు నశోక మహా రాజు తీర్థయాత్రలు చేయుచు నిచ్చటికి వచ్చి యీ శిలా స్తంభమును నిర్మింపఁ జేసెను. ఈ దివ్య క్షేత్రము భగవానుఁడగు బుద్ధ దేవుని జన్మస్థానము.”

పుణ్యస్థల మాహాత్మ్యమును స్మరించుకొనుచు నా క్షేత్ర గౌరవమును వృద్ధి చేయునుద్దేశముతో బోధిసత్వుని పావన నామము పై నాలుంబినీ క్షేత్రమును నిష్క రముగఁ జేసి వై చెను. పిమ్మట నందఱును కలసి కపిలవస్తునగరము వైపునకుఁ బ్రయాణము చేసిరి. శాక్య రాజుల రాజధాని గౌరవ చరిత్రమున నా లోక ప్రసిద్ధంబగు నగర సుఖసమృద్దుల విశేషముంగూర్చి వాడు వినియుండిరి. కాని యింతవఱకు నా సౌభాగ్యమును వారు దర్శింప లేదు. సిద్ధార్థుని సన్యాస గ్రహణానంతరమున రాజనగర సౌభాగ్యము మ్లానమై యుండెను; తరువాత రెండువందల సంవత్సరములలోఁ గాలతరంగా ఘాతములచే నా నగర సౌందర్యము వినష్టమైపోయినది. ప్రతిస్థలమునను బూర్వస్మృతిని గలిగించు నిటుకలును, శిలాఖండములును మాత్రము నిలిచియున్నవి. ఒక్కొక్కచోటఁ బ్రశస్త శిలాఖండముల పైఁ జిత్రింపఁబడిన సిద్దారుని తల్లి దండ్రుల ప్రతి మూర్తులు కానవచ్చుచుండెను.అక్కడక్కడ సిద్ధార్థుని జనన చరిత్రమును, నాతని గృహ త్యాగవృత్తాంతమును బ్రదర్శించు దృశ్యము లతిమనోహర