పుట:ASHOKUDU.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము

93

ప్రియదర్శనుఁడగు నశోకుఁడు తన తీర్థ దర్శనము చిరస్మరణీయమగునట్లు చేయు నుద్దేశముతో నచ్చట నొక విశాలస్తూపమును నిర్మింపఁ జేసి దాని సమీపమునం దొక శిలా స్తంభము పై బుధ్ధ దేవుని పవిత్రనిర్వాణ వృత్తాంతము నక్షర రూపమున వెలయింపఁ జేసెను.

అచ్చటనుండి “భక్తబృందలుంబినీ విహారోద్యానము” ను జూచుటకు బయలు దేరెను. ఆ పవిత్ర స్థానము న సిద్ధార్థుఁడు జనియించెను. ప్రపంచమునంగల పుణ్య క్షేత్రములన్నిటిలో నను లుంబినీ క్షేత్రము ముఖ్యమైనది. ఉపగుప్తుఁడు లలితవచనములతో భ క్తిగద్గదస్వరముతో బుద్ధ దేవుని జన్మ చరిత్రమును సవిస్తరముగ వర్ణించి చెప్పెను. స్థానమాహాత్మ్యము, ప్రసంగ పవిత్రత, శ్రోతలయాదర భావము, వక్త యోగ్యత, భాషాలాలిత్యము సర్వము నేకీభవించుటచే నా దివ్య క్షేత్ర మపూర్వ శోభా విలసితమై కానవ చ్చెను. నయన శ్రవణ హృదయంబులకు సమ్మేళనానుభవం బయ్యెను. తీర్థయాత్రికులందఱును దాము ధన్యుల మైతి మని భావించు కొనిరి.

అశోక మహారాజా ధివ్యస్థలమును జిరస్మరణీయముగఁ జేయవలయు ననును దేశముతో నచ్చట నత్యున్నతంబగు శిలా స్తంభమును నిర్మింప జేసెను; ఆ శిలా స్తంభమునందీ క్రింది వాక్యములను జిత్రింపఁ జేసెను.