పుట:ASHOKUDU.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము

95

ముగఁ గాననచ్చుచుండెను; ఆ నగరమునందలి విశాల సౌధములును, ప్రాకారములును నిప్పుడే మైపోయినవి? ఇప్పుడచ్చట నెల్ల చోటులను విహారములును మఠములును జైత్య ములునుమాత్రము విరాజమానము లగుచుండెను. బౌద్ధ భిక్షులు రాజయాత్రికులకు భగ్నస్తూపముల నొక్కొక్కటిగఁ జూపును వాని పూర్వచరిత్రమును వర్ణించి చెప్పుచుండిరి. ఈ విధముగా మహా రాజును, ధర్మాచార్యుఁడగు నుపగుప్తుఁ,డును దక్కిన యాత్రికులునుగూడ నచ్చట దర్శింపవలసిన దృశ్యముల నన్నిటిని దర్శించిరి. అనంతరము మహా రాజా నగరమును విడుచుటకు మునుపే మహాత్ముఁడగు బుద్ధుని బాల్య కౌమార యౌవన వివిధఘటనా పరంపరల నన్నిటిని జిరస్మరణీయములుగఁ జేయునుద్దేశముతో స్తూప స్తంభ కూపపరిఘానులను నిర్మించుట కాజ్ఞాపించెను. శాక్య రాజపుత్రు,డగు సిద్ధార్థునిసన్యాస గ్రహణమువలన విలాసమందిర ప్రమోహాద్యానము లయవస్థంజూచి 'రాజర్షి యగు నశోకుని హృదయమును, వాసనావిరహితుఁడగు నుపగుప్తుని హృదయమును మఱింత నిస్పృహత్వముం గాంచెను. అప్పుడు వారి హృదయములయందు, సంసారా నిత్యత్వమును, దృశ్యజగత్సదార్థముల య శాశ్వతత్వమును, నిశ్చయముగ విస్పష్టముగ గానవచ్చేను.

కపిలవ స్తు నగరమును దర్శించుట చే వారికి ధనజన సుఖైశ్వర్యముల యస్థిరత్వముఁ గూర్చి బాగుగ భోధపడి