పుట:ASHOKUDU.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

అ శో కుఁ డు

మహారాజ్ఞీ మణి యొక ప్రశ స్తసరోవరమును బ్రతిష్ఠించి యుండెను; ఆ సరోవరము నలువంకలను గల సమున్నత విశాల తీరములు ఫలపుష్పతరులతావిలసితములుగఁ జేయించెను. మహారాజును, రాణీయు, గొప్పగొప్ప రాజోద్యోగులును సంపన్న గృహస్థులును, ధనవంతులును, శ్రేష్ఠులగు వణిగ్జను లును, యశస్సుకొఱకును, బుణ్యముకొఱకును, సాధారణజనుల సౌఖ్యము కొఱకును, బ్రాహ్మణులు యతులు మొదలగు వారి ప్రీతికొఱకును, నగర మధ్యప్రదేశమునను బుర బాహ్య ప్రదేశములనుగూడ ననేక కూపములను, దటాకములను, జైత్యములను, మఠములను, మందిరములను బ్రతిష్ఠించి యుండిరి. అచ్చటి రాజు గుణవంతులనాదరించుచుండెను; పండితగణములకు భూములను వృత్తులను గల్పించి వారి గౌర వోత్సాహములను వర్ధిల్ల ఁ జేయుచుండెను. ఆమహారాజు దీనుల దుఃఖములను, బీడితుల కష్టములను దొలఁగించుట కనేక సౌకర్యములను గావించియుండెను. ఏనగరమున నిట్టిమహా రాజు నివసించి యుండెనో యెచ్చట నింతటి దానశీలురగు నైశ్వర్యవంతులు వాసము చేయుచుండినో, యే స్థానమునందు, గృషి వాణిజ్యము లింతటి యున్నత స్థానము నలంకరించి, యుండెనో యట్టిపట్టణమున నానా విధంబులగు జనసంఘములు వచ్చుచుఁబోవుచుండె ననియు, ధనవంతులును, దరిద్రులును గూడఁ గలసి నివసించుచుండిరనియుఁ జెప్పుటకంటె నింకను నాశ్చర్యకర మగు విషయమేమున్నది !

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/10&oldid=332995" నుండి వెలికితీశారు