పుట:ASHOKUDU.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామచంద్ర.

అశోకుఁడు

మొదటి ప్రకరణము

దైవజ్ఞుఁడు

ఇప్పుడు 1919 వ క్రీస్తుశకవత్సరము నడుచుచున్నది. ఇప్పటి కించుమించుగ 2,150 సంవత్సరములకుఁ బూర్వపు చరిత్రమునుగూర్చి వ్రాయుచున్నారము. భాగల్ పురమునకు పశ్చిమభాగమున గంగాశాఖానది యొకటి ప్రవహించుచున్నది. ఆనదిపేరు చంపావతి-ఆనదియొడ్డుననే చంపకనగర ముండెను. చంపకనగరమునం దొక మహారాజు నివసించి యుండెను. ఆనగరమునం దనేకధనవంతులును వర్తకులును నివాసము చేయుచుండిరి. ఆపట్టణ మతిలోకసుందరమైనది. రాజప్రాసాదమును, ధనవంతుల సుందరసౌధములును, వారి విలాసోద్యానములును, వణిగ్వరులయమూల్యవివిధవస్తు ప్రపూర్ణంబులగు విపణి! శ్రేణులును గలసి యానగర సౌభాగ్య

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/9&oldid=349729" నుండి వెలికితీశారు